Budget 2024 Live Updates: ఆర్థిక మంత్రి కీలక ప్రకటనలు.. కేంద్ర బడ్జెట్ హైలెట్స్‌ ఇవే..!

Thu, 01 Feb 2024-12:46 pm,

Budget Announcement 2024 Live in Telugu: ఓటాన్ బడ్జెట్‌ కోసం దేశ ప్రజలు ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు. ఎవరికి మోదం.. ఎవరికి ఖేదం.. అనేది ఆసక్తికరంగా మారింది. కేంద్ర ఆర్థికశాఖ మంత్రి నిర్మలా సీతారామన్ పార్లమెంట్‌లో బడ్జెట్‌ ప్రవేశపెట్టనున్నారు. లైవ్ అప్‌డేట్స్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

New Budget 2024 Announcement in Telugu: దేశవ్యాప్తంగా ప్రజలు ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఓటాన్ బడ్జెట్‌ను కేంద్రం ప్రభుత్వం మరికాసేపట్లో పార్లమెంట్‌లో ప్రవేశపెట్టనుంది. లోక్‌సభ ఎన్నికల నేపథ్యంలో బీజేపీ సర్కారు వరాల జల్లు కురిపిస్తుందని ప్రజలు ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. తెలుగు రాష్ట్రాలకు ఎలాంటి కేటాయింపులు ఉంటాయనేది కూడా ఆసక్తికరంగా మారింది. లోక్‌సభ సార్వత్రిక ఎన్నికల్లో హ్యాట్రిక్‌ విజయంపై కన్నేసిన బీజేపీ.. ఈ బడ్జెట్‌లో జనాకర్షక నిర్ణయాలను ప్రకటించే అవకాశం కనిపిస్తోంది. సంక్షేమం, అభివృద్ధి అంశాల్లో సమతుల్యత పాటిస్తుందా..? ఆర్థిక వ్యవస్థను వృద్ధి పథంలో పరుగులు పెట్టించేలా ప్రణాళికలు రచిస్తుందా..? అనేది ఉత్కంఠగా మారింది. కేంద్ర ఆర్థికశాఖ మంత్రి నిర్మలా సీతారామన్ బడ్జెట్‌ ప్రసంగానికి సంబంధించిన లైవ్‌ అప్‌డేట్స్ కోసం ఇక్కడ ఫాలో అవ్వండి. 
 

Latest Updates

  • Live Budget 2024 in Telugu: కరెంటు కష్టాలు లేని దేశ నిర్మాణానికి ప్రభుత్వం ఉందని కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్ వెల్లడించారు. దేశంలో కోటి ఇళ్లపై రూఫ్ టాప్ సోలార్ సెటప్స్ ఏర్పాటు చేస్తామన్నారు. ప్రతి ఇంటికి 300 విద్యుత్ ఉచితంగా అందిస్తామని బడ్జెట్లో ప్రకటించారు. దీంతో ప్రతి కుటుంబానికి ఏటా రూ. 15-18 వేలు ఆదా అవుతుందన్నారు. వినియోగం పోగా మిగిలిన విద్యుత్ను పంపిణీ సంస్థలకు విక్రయించవచ్చని తెలిపారు.
     

  • Live Budget 2024 in Telugu: ప్రత్యక్ష పన్నుల వసూళ్లు మూడు రెట్లు పెరిగాయని నిర్మలా సీతారామన్ తెలిపారు. ట్యాక్స్‌ పేయర్స్ సొమ్మును దేశాభివృద్ధికి వినియోగిస్తున్నామన్నారు. కొత్త పన్ను విధానంలో రూ.7 లక్షల వరకూ ఎలాంటి పన్నులేదన్నారు.

  • Live Budget 2024 in Telugu: యువతకు బడ్జెట్‌లో గుడ్‌న్యూస్ చెప్పారు. నామమాత్ర వడ్డీ లేదా అసలు వడ్డీ లేకుండా దీర్ఘకాలిక రుణాలు ఇస్తామని కేంద్ర ఆర్థిక మంత్రి ప్రకటించారు. ఇందుకోసం లక్ష కోట్ల రూపాయలతో కార్పస్ ఫండ్ ఏర్పాటు చేస్తామని తెలిపారు.

  • Live Budget 2024 in Telugu: పౌర విమానయాన రంగాన్ని బలోపేతం చేస్తాం..
    1000 కొత్త విమనాలు ఆర్డర్ ఇచ్చాం..

  • Live Budget 2024 in Telugu: నానో యూరియా తరువాత పంటలకు నానో డీఏపీ కింద ఎరువులు అందిస్తామని నిర్మలా సీతారామన్ తెలిపారు. ఆయిల్‌ సీడ్స్‌ రంగంలో ఆత్మనిర్భరత సాధిస్తామన్నారు. స్వయం సహాయక బృందాల్లో కోటి మంది మహిళలు లక్షాధికారులు అయ్యారని.. లక్‌ పతీ దీదీ లక్ష్యాన్ని 2 కోట్ల నుంచి 3 కోట్లకు పెంచుతున్నామన్నారు. పరిశోధన, సృజనాత్మకతకు రూ.లక్షల కోట్ల నిధి ఏర్పాటు చేస్తామని తెలిపారు. మౌలిక వసతుల రంగం 11.1 శాతం వృద్ధితో రూ.11 లక్షల 11 వేల 111 కోట్ల కేటాయించినట్లు వెల్లడించారు.

  • Live Budget 2024 in Telugu: బడ్జెట్ లైవ్‌ ప్రసంగం

    COMMERCIAL BREAK
    SCROLL TO CONTINUE READING

     

  • Live Budget 2024 in Telugu: 30 కోట్ల మంది మహిళలకు ముద్రలోన్లు అందించాం.
    80 కోట్ల మందికి ఉచితంగా ఆహార ధాన్యాలు అందించాం..
    25 లక్షల మందిని పేదరికం నుంచి గట్టేక్కించాం..

  • Live Budget 2024 in Telugu: ప్రజల ఆదాయం 50 శాతం పెరిగింది: నిర్మలా సీతారామన్
    యువత ఉపాధికి పెద్ద పీట వేశాం
    పేదలకు జన్‌ధన్‌ ఖాతాల ద్వారా 34 లక్షల పేదలకు నేరుగా నగదు అందించాం..
    యువతకు నాణ్యమైన విద్యే మోదీ లక్ష్యం

  • Live Budget 2024 in Telugu: 2047 నాటికి అభివృద్ధి చెందిన భారత్‌గా అవతరించేందుకు కృషి చేస్తున్నామని ఆర్థిక మంత్రి తెలిపారు. 4 కోట్ల రైతులకు పంటల బీమా అందించామని చెప్పారు. అన్ని ప్రాంతాల అభివృద్ధే తమ లక్ష్యమన్నారు.

  • Live Budget 2024 in Telugu: నూతన సంస్కరణలతో కొత్త పారిశ్రామికవేత్తలకు అవకాశం కలిగిందన్నారు నిర్మలా సీతారామన్. మద్దతు ధరలు, పెట్టుబడి రాయితీలతో రైతులకు ప్రయోజనాలు కల్పించామని తెలిపారు.

  • Live Budget 2024 in Telugu: పదేళ్లలో ప్రధాని మోదీ తీసుకువచ్చిన ఆర్థిక సంస్కరణలు అందరికీ చేరువ అయ్యాయి: నిర్మలా సీతారామన్

    COMMERCIAL BREAK
    SCROLL TO CONTINUE READING

    అవినీతిని గణనీయంగా తగ్గించాం: 

    గత పదేళ్లలో ఇళ్ల నిర్మాణానికి కృషి చేశాం..

    పాలన దర్శక పాలన అందించాం..

  • Live Budget 2024 in Telugu: డిజిటల్ రూపంలో ఓటాన్ బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి. అన్ని ప్రాంతాల అభివృద్ధి లక్ష్యంగా బడ్జెట్‌ను రూపొందించినట్లు చెప్పారు. 
     

  • Live Budget 2024 in Telugu: నిర్మలా సీతారామన్ బడ్జెట్ ప్రసంగం మొదలుపెట్టారు. ఆరోసారి బడ్జెట్‌ను ఆమె ప్రవేశపెడుతున్నారు.

  • Live Budget 2024 in Telugu: కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌తో పాటు ఇతర మంత్రులు, అధికారులు రాష్ట్రపతి ద్రౌపది ముర్ముతో సంప్రదాయంగా సమావేశమయ్యారు.  
     

  • Live Budget 2024 in Telugu: దేశంలో ఇప్పటివరకూ 77 పూర్తి స్థాయి బడ్జెట్‌లు, 14 తాత్కాలిక బడ్జెట్‌లు ప్రవేశపెట్టారు. స్వతంత్ర్య భారతదేశపు తొలి బడ్జెట్‌ను 1947 నవంబర్ 26న ప్రవేశపెట్టారు. దేశంలో బడ్జెట్ గురించి ఆసక్తికరమైన అంశాలు, తొలి బడ్జెట్ ఆదాయం అంచనా వంటి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

  • Live Budget 2024 in Telugu: బడ్జెట్‌ ప్రసంగానికి ముందు కేంద్ర కేబినెట్ మీటింగ్ ప్రారంభమైంది. బడ్జెట్‌కు మంత్రివర్గం ఆమోదం తెలపనుంది.
     

  • Live Budget 2024 in Telugu: బడ్జెట్‌ను డిజిటల్‌ రూపంలో కూడా కేంద్ర ప్రభుత్వం అందుబాటులోకి తీసుకువచ్చింది. ఆర్థిక మంత్రి ప్రసంగం ముగిసిన తరువాత కేంద్ర‌ బడ్జెట్ మొబైల్‌ యాప్‌లో బడ్జెట్‌ పూర్తి కాపీని చూసుకోవచ్చు. www.indiabudget.gov.in వెబ్‌సైట్‌ అందుబాటులో ఉంటుంది.

  • Live Budget 2024 in Telugu: మరికాసేపట్లో ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ బడ్జెట్‌ను ప్రవేశపెట్టనున్నారు. బడ్జెట్‌ ప్రతులను సభ్యులకు అందజేసేందుకు ఇప్పటికే పార్లమెంట్‌కు చేర్చారు.

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link